7, ఫిబ్రవరి 2011, సోమవారం
మా విలీనం చూసి ‘బాబు’ భయపడుతున్నారు : చిరు
పార్టీ, కాంగ్రెస్ పార్టీ విలీనం కావటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి భయం పట్టుకుందని... అందుకే విమర్శలకు తనపై దిగుతున్నారని తాజా కాంగ్రెస్ నేత చిరంజీవి ఆరోపించారు. సోమవారం ఆయన కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డిని కలసిన అనంతరం మీడియాలో మాట్లాడుతూ.... విలీనంపై ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోబోమని ఆ అవసరం కూడా తమకు లేనే లేదని స్పష్టం చేసారు. ప్రజలకు క్షమాపణలు చెప్పి తిరిగి ఎన్నికల్లో పోటీకి దిగాలంటూ సిపిఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యపై “సీరియస్” కానవసరలేదన్నారు. తమ విలీనం చూసి ఎందరో భయపడుతున్నారని... రాష్టంలో పునాదులు కూడా సరిగా లేని బిజేపీ కూడా మాట్లాడితే ఎలా? అన్నారు. వారు ఏనాడో అసిత్వం కోల్పోయిన పార్టీ అని గుర్తెరగాలని సూచించారు. కాంగ్రెస్ అధినేతి సోనియా తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా సమర్ధవంతంగా నెలవేరేందుకు తానెప్పుడూ సిద్దంగా ఉన్నానని చెప్పారు చిరంజీవి.