చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడం వల్ల కాంగ్రెస్‌లో మరింత సామాజిక న్యాయం జరుగుతుందని తాను భావిస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ...ఇప్పటికే కాంగ్రెస్ సామాజిక న్యాయం పాటిస్తుందని.. చిరంజీవి కాంగ్రెస్‌లో చేరడం వల్ల మా బలం పెరగడమే కాకుండా నాయకత్వం కూడా పెరుగుతుందన్నారు.
సామాజిక న్యాయం కోసం వారు చిరంజీవిని ఎంతో నమ్ముకొని ఆయన వెంట ఉన్నారన్నారు. కాబట్టి వారికి సరియైన ప్రాధాన్యం కల్పించాల్సిన బాధ్యత చిరంజీవిపై ఉందని చెప్పారు. చిరంజీవి మీకు పోటీ అని భావిస్తున్నారా ? అని ఓ విలేకరి ప్రశ్నించగా ... నాకెవరూ పోటీ కాదని పార్టీలో మంచి బలం ఉందని వ్యాఖ్యానించారు