7, ఫిబ్రవరి 2011, సోమవారం

వైఎస్‌ హయాంలో అవినీతికి పోల’వరం”

తెలుగుదేశం పార్టీ వైఎస్‌ హయాంలో జరిగిన అవినీతి వ్యవహరాలపై ప్రచురించిన ‘రాజా ఆఫ్‌ కరప్షన్‌” పుస్తకంలోని ప్రతి అక్షరాన్ని ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు వల్లె వేస్తున్నారని... తెలుగుదేశం పార్టీ వాఖ్యానించింది. సోమవారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ... తన తండ్రి హయాంలోనే పోలవరానికి అంకురార్పణ జరిగిందని చెప్తున్న వైఎస్‌ జగన్‌ తాను పార్లమెంటు సభుడిగా ఉన్నపుడు ఏనాడు పోలవరం గూర్చి మాట్లాడలేదని... పైగా వైఎస్‌, కేవీపీ, జగన్‌లో జలయజ్ఞం ముసుగులో కోటుల దోచుకుని ప్రోజక్టు పనులు పూర్తి కాకుండా చేసారని... ఇప్పుడు పోలవరం అంటూ కేవలం రాజకీయాలు చేసేందుకే జగన్‌ పాదయాత్రలు చేసున్నాడని విమర్శించారు. రోశయ్య ప్రభుత్వ హయాంలో పనులేమీ జరగక పోయినా...500 కోట్ల బిల్లులు అప్పనంగా చేయించుకున్న ఘనుడు జగనేనని... ఆపై వారి మధ్య వాటాలు కుదరక పోవటం వల్లే అసలు విషయాలు ఇప్పుడే తెలినట్లు కాంగ్రెస్‌ నేతలు బైటకు తెస్తున్నారని వాఖ్యానించారు.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసుకుని చిరంజీవిని కేంద్ర మంత్రిని చేయాలంటూ వైఎస్‌ బతికున్నపుడ 5 పేజీల లేఖరాసాడని చెప్తున్న ఉండవల్లి దానిలోని ప్రతి అంశాన్ని ఎందుకు మీడియాకు వెల్లడించడంలేదని... ఆ లేఖ మేరకే అప్పట్లో జరిగిన ఒప్పందాలే... ఇప్పుడు తిరిగి సోనియా, చిరుల మధ్య జరిగి అమలుకు హామీ లభించాకనే రెండు పార్టీల విలీనం ఖరారైనట్టు కనిపిసోందని విమరించారు చంద్రమోహన్‌ రెడ్డి.