కాంగ్రెస్ నేతల పంచెలూడదీసి కొట్టాలన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇపుడు అన్నయ్య పంచెలూడగొట్టాలని పిలుపు ఇవ్వాలని ఇస్తాడా? అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్‌పేట శాసనసభ్యుడు కిషన్‌రెడ్డి సూచించారు. 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పై పీఆర్పీ నిప్పులు చెరిగి ఇప్పుడు వారి పంచన చేరడం ఏమిటని ...కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి 18 సీట్లు గెలుచుకున్న ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారనిప్రశ్నించారు.
చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటును కూడా చెల్లించడం లేదని...ప్రభుత్వం వెంటనే ఫీజులు చెల్లించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చౌక్ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్సుమెంటు చెల్లించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.