హాలీవుడ్ భామ పామెలా ఆండర్సన్ మూగజీవాల హక్కుల కోసం నడుంబిగించింది. వన్య ప్రాణుల సంరక్షణ కోసం శ్రమిస్తున్న సంస్థ పెటా తరపున ఆమె ఇప్పుడు మూగజీవాల కోసం ఢిల్లిdలోని అఖిల భారత విజ్ఞాన సంస్థ పై ఓ కన్నేసింది.
ఈ సంస్థ (ఎఐఐఎంఎస్) నిర్వహిస్తున్న పరిశోధన లపై తీసిన వీడియోను చేజిక్కించుకుంది. ఆవీడియోలో కోతులను ఏ విధంగా పరీక్ష లకు గురి చేసిందీ చూసి చకితురాలైంది. ఈ ఘోరమైన టెస్టులనుండి కోతులను మినహాయించాలని సంస్థ డైరెక్టర్ ఆర్.సి. దేశాయ్‌కు ఫిర్యాదు చేసింది.
అంతేకాకుండా సంస్థలో పరిశోధనలు మానవీయ కోణంలో జరగాలని మెడికల్ సర్వీస్ సంస్థకు సలహాలు ఇచ్చింది. ఇది వరకే జంతు పరి రక్షణ చట్టం 2011 ప్రకారం జంతువులను టెస్ట్‌లకు ఉపయో గించరాదని వుంది. ఆయా పరీక్షలలో అవి విపరీతమైన బాధకు, భయా నికి గురవుతాయని డ్రాఫ్ట్ బిల్లులో పేర్కొ న్నారు. సంస్థలు నిర్వహించే పరీక్షలలో వాటికి ఎటువంటి బాధ కలుగకుండా శ్రద్ధవహించా లని, ఎప్పటికప్పుడు పరిశీల నకై, ప్రభుత్వేతర సంస్థలు, కేంద్ర జంతు ప్రదర్శన శాల, పశువుల వైద్యులను ఎంపిక చేసింది.
పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత, జంతు వుల పరిశోధనలలో వాటికి తీవ్రమైన బాధ కల్గితే, ఆయా పరిశోధనలు జరిపేవారిపై తీవ్ర చర్యలుంటాయి. పామెలా ఆండర్సన్, ఆ వీడి యాలో కేవలం కోతులే కాకుండా కుందేళ్లు, చుంచులు, తదితర జం తువులను పరిశోధనలు చేసి, కొత్తమందు లను తయారు చేయనున్నారు. పామెలా, తక్షణమే ఆ పరిశో ధనలను నిలిపి వేయమన్నది.
కేంద్ర జంతువుల ఫెసిలిటీని ఆధుని కీకరించాలన్నది. అలాగే శిక్షణ పద్ధతులను మెరు గుపరచి, పరిశోధన లను మానవీయ కోణం లోనే చేయాలన్నది. హాలీ వుడ్ నటి భారతదేశంలోని మూగజీవాలపట్ల చూపి స్తున్న శ్రద్ధపట్ల, పలువురు మద్దతు అందిస్తున్నారు. పెటా సంస్థ, హాలీవుడ్ నటులకు మానవీయ థృక్కోణంపై ఆసక్తిని కల్పించడం ముదావహం.
పారిస్ హిల్టన్ నేస్తం బుల్లి వానరం
పారిస్ హిల్టన్‌కి మూగజీవాలంటే ఆసక్తి మెండు. ఈ మధ్య తన 30వ జన్మది నాన్ని ఉడుతలా వుండే బుల్లి వానరం తది తర వన్య జంతువులతో హాలీ వుడ్ హిల్స్‌లో ఘనంగా జరుపు కొంది. పెంపుడు జంతువుల ప్రదర్శ నశాలను తరచు సందర్శి స్తుంది. వాటి ఆరోగ్య పరిరక్షణ, ఆహారాన్ని సరిగా సమయా నికి అంద జేస్తున్నా రనే అంశా లపై శ్రద్ధ వహిస్తున్నది. పారిస్ హిల్టన్ తన జన్మదినం వేడుకలలో మూగ జీవాలకు కూడా ప్రాధాన్యత కల్పించటం పలువురిని ఆశ్చర్యపరిచింది.