తెలంగాణా రాష్ట్ర సమితి నేతలో, సీమాంధ్ర పెట్టుబడి దారులో తమని రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసినంత మాత్రాన తాము రాజీనామాలు చేయబోమని స్పష్టం చేసారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
గురువారం ఆయన శాసనసభ ఆవరణలో మీడియాలో మాట్లాడుతూ.... తెలంగాణా వాదులను, నేతల్ని తప్పుపటేలా సీమాంధ్ర ఎంపీ కావూరి సాంబశివరావు వాఖ్యలు చేయటాన్ని ఖండిస్తూ...సీమాంధ్రలో కావూరి, లగడపాటిలాంటి పెట్టుబడిదారులు దోపిడీదారులు తెలంగాణా లో ఎవరైనా ఉన్నారా? అని నిలదీసారు. తొలిసారి ఎంపికైన దగ్గుబాటి పురంధీశ్వరికి మంత్రి పదవి వచ్చిందని.. ఐదు సార్లు ఎంపీగా ఎన్నికైనా నేటికి కావూరికి మంత్రి పదవి రాలేదంటేనే ఆయన పట్ల కాంగ్రెస్ అధిష్టానంకి ఏమేరకు నమ్మకం ఉందొ.. ఎందుకు ఆయన్ని గుర్తించలేదో అర్ధమవుతుందని, పదవులు లేకపోతే బతకలేనిది వ్యాపారాలు మూల పడిపోతా యన్న బాధ ఉన్నది సీమాంధ్ర ఎంపీలకేనని ఘాటుగా విమర్శించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
కావూరి సాంబశివరావు తన వ్యాఖ్యలతో తమ ప్రాంత ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. తామరాజీనామాలే కాదని, తలచుకుంటే ఏదైనా చేయగలమన్నారు.