పెదవులతో పెదవులు కలిపి ఎక్కువ సమయం తీసుకుంటూ ఘాటుగా ముద్దాడే ప్రక్రియ హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి అక్కడ నుంచి దక్షిణాదికి పూర్తిగా పాకింది. కెమెరా ముందు తెరమీద కనిపించడానికే కాకుండా పెదవులుతో పెదవులు కలపడం, గట్టి కౌగిలింతలు వివిధ వేడుకలు జరిగే వేదికల మీద కూడా ఉత్తరాది నాయికలు రంగ ప్రవేశంతో ఎక్కువై, కామన్ అయిపోతోంది, సినిమాల్ని చూసి జనం, జనాన్ని చూసి సినిమాలు అన్నట్టు.
క్రమంగా ముద్దుల మీద ఒక్కొక్కరూ మెల్లిగా వ్యతిరేఖత వ్యక్తం చేయడం ప్రారంభించారు. అనుభవం నేర్పిన పాఠాలు వల్లనో ఏమో, గాఢ చుంబనాలు వల్ల నోటి దుర్వాసన, ఉఛ్వాస నిశ్వాసాల వల్ల భరించాల్సిన కంపు కొంత ఇబ్బంది పెడుతున్నట్టున్నాయి. దానికి తోడు టూత్‌పేస్టులకు సంబంధించిన ప్రకటనలు కూడా స్పందింప చేస్తున్నాయి. అందుకే నేమో కంగనారానౌత్ ''ఇకనుంచి పెదవితో పెదవి కలపను కెమెరా ముందు'' అంటోంది. మరిన్ని వివరాల్లోకి వెడుతూ నోట్లో చాలా క్రిములుంటాయని, అవి ఒకరి నోట్లోంచి మరొకరి నోట్లోకి అలా మరొకరి నోట్లోకి వెళుతుంటాయి. ఆ విషయం ఆలోచిస్తేనే చిరాగ్గా వుండి ఏహ్యభావం కలిగిస్తోందని అందుకే ఇక ముద్దులకు ఫుల్‌స్టాప్ పెట్టడానికి నిర్ణయం చేసుకున్నానంటోంది.