3, మార్చి 2011, గురువారం
తన పిల్లలకు ఉన్నత జీవితాన్నందించడమే లక్ష్యం: ఆస్కార్ అవార్డు గ్రహీత కాటే విన్స్‌లెట్
తన పిల్లలకు సమాజం నుంచి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నదే తన లక్ష్యమని ఆస్కార్ అవార్డు గ్రహీత, నటిగా మారిన మోడల్ కాటే విన్స్‌లెట్ పేర్కొన్నారు. తన పిల్లలకు ఉన్నత జీవితాన్ని అందించాలని భావిస్తున్నానని గత ఏడాది సినీ దర్శకుడు శామ్ మెండెస్‌తో విడాకులు తీసుకున్న కాటే అమెరికాకు చెందిన ఓ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమెకు మియా (10), జాయ్ (7) పిల్లలున్నారు. గతంలో తనను సమాజం విభిన్నంగా చూసిన పరిస్థితులు తన పిల్లలను రానివ్వబోనని కాటే తెలిపారు. వారిని మానవీయతకు ప్రతిబింబాలుగా తీర్చి దిద్దాలని భావిస్తున్నానని ఆమె చెప్పారు. తన పిల్లలు చాలా మంచి నడవడిక కలవారని తోటి వారు చెప్పడమే తనకు అత్యున్నత ప్రశంస అని కాటే పేర్కొన్నారు. తాను లావుగా ఉంటే ప్రజలు వెనక్కు నెట్టివేసేవారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తన శరీరంలో ప్రతి అవయవం తనకిష్టమేనని కాటే ఆ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.