కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం తెలంగాణకు ఏమాత్రం వ్యతిరేకంగా ప్రవర్తించిన ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు హెచ్చరించారు.గురువారం లోక్‌సభ రేపటికి వాయిదా పడిన తర్వాత తెలంగాణ ఎంపీలు విలేకరులతో .... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవులు వదులుకునేందుకు సిద్ధమని..రాజీనామా పత్రాలు వెంట పెట్టుకుని తిరుగుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో ఈ రాత్రి సమావేశమవుతున్నట్టు వారు చెప్పారు.
తాము పదవులకోసం వెంపర్లాడుతూ.. కావూరి, లగడపాటి లాంటి నేతల పేర్లు చెప్పి తెలంగాణా ప్రజల్ని మోసం చేస్తున్నట్లు కావూరి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు..