తెలంగాణ ఉద్యమం పేరుతో రాజకీయ లబ్ది పొందుతూ ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారని, ఉద్యమం పేరిట కేసీఆర్ చేస్తున్నదేమిటని తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ రఘునందన్ ప్రశ్నించారు. ఉద్యమ స్ఫూర్తితో స్థాపించిన టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా కేసీఆర్ మాట్లాడటం శోచనీయమని అన్నారు. ఎందరో విద్యార్థుల బలిదానాలు చేసి తెలంగాణ కోసం ఉద్యమాన్ని నిర్వహిస్తుంటే కేసీఆర్ తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కాంగ్రెస్‌తో పోతామనడం విడ్డూరంగా ఉందన్నారు.