తెలంగాణ ప్రజల ఆత్మహత్యలపై, ఉద్యమాలపై ఎక్కడా ప్రస్తావించకపోవడం విడ్డూరమని, ఈ కమిటీ నివేదికపై అఖిలపక్షాలు ఏర్పాటు చేయడం, చర్చలు జరపడం శుద్ధ దండగని, వెంటనే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృంద కో నిర్వాహకుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు. అందరిని మేనేజ్ చేయడంలో సీమాంధ్ర నాయకులు, పెట్టుబడిదారులు ఎంత సిద్ధహస్తులో దీంతో రుజువైందన్నారు. ఈ కమిటీని వదిలిపెట్టమని కమిటీ చైర్మన్‌తో సహా సభ్యులకు శిక్ష పడేంత వరకు న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను కమిటీ సభ్యులు నిర్లజ్జగా మోసగించారని ఆరోపించారు.