శ్రీకృష్ణ కమిటీ అంటే తమకు గౌరవం ఉందని, నివేదికలో తెలంగాణ అంటేనే నక్సలైట్లనే భావనను తీసుకురావడం సిగ్గుచేటన్నారు. కచ్చితంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేదిగా ఈ నివేదిక ఉందంటూ మండిపడ్డారు భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు సి.హెచ్. విద్యాసాగర్‌రావు, ఈ కమిటీ నివేదికపై సామాన్యులకు అసహయం కలుగుతోందన్నారు. కమిటీ తన పరిధి దాటి చెప్పకూడని విషయాలను రహస్య నివేదికలో చేర్చి తెలంగాణను వ్యతిరేకించడం అప్రజాస్వామికం అన్నారు. అణచివేసేందుకు సూచనలు చేయడం దుర్మార్గమన్నారు. తెలంగాణ ప్రజల అవస్తలను, ఆత్మబలిదానాలను కనీసం చూపించకపోవడం తెలంగాణ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉందన్నారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు శిక్షార్హులని ఆయన పేర్కొన్నారు.