25, మార్చి 2011, శుక్రవారం
'ఆంధ్ర కసబ్' రాజగోపాల్
తెలుగుదేశం శాసన సభ్యుడు రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌ను 'ఆంధ్ర కసబ్'గా అభివర్ణించారు. ఆయన రాసిచ్చిన అంశాన్నే శ్రీకృష్ణ కమిటీకి ప్రభుత్వానికి ఇచ్చిందని ఆరోపించారు. ఈ 8వ అధ్యాయం తెలంగాణ ప్రజలను అగౌరపరిచేలా ఉందని, ఇందుకు బాధ్యుడైన జస్టిస్ శ్రీకృష్ణకు ఉరిశిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీకి అనువాదకులు సీమాంధ్రవాదులేనని, ఈ పరిస్థితుల్లో తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ సీమాంధ్ర పెట్టుబడిదారులు ఇచ్చిన కాసుల మూటలకు లొంగిపోయారని తెలంగాణ ప్రజలు ఆ మూటలు ఇవ్వలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణను న్యాయమూర్తిగా పోల్చడం విచారకరమని కమిటీ నివేదిక న్యాయబద్ధంగా లేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.