శ్రీకృష్ణ కమిటీ నివేదిక న్యాయ వ్యవస్థపై విశ్వాసం కోల్పేయే విధంగా ఉందన్నారు హరీష్‌రావు. శ్రీకృష్ణుని పాత్ర పోషిస్తాడనుకున్న జస్టిస్ శ్రీకృష్ణ శకుని పాత్ర పోషించాడని కమిటీ తన రక్తదాహాన్ని చూపించిందన్నారు. శ్రీకృష్ణ కమిటీ సీమాంధ్ర నేతలకు అమ్ముడుపోయి వారు చెప్పిందే నివేదికలో పొందుపరిచారని ఆయన ఆరోపించారు. వీరి నిర్వాకం వల్ల కమిటీలపై ప్రజల్లో విశ్వసనీయత తగ్గి, ప్రజాస్వామ్యంపై విలువ కోల్పోయేదిగా ఉందన్నారు. లగడపాటి రాజగోపాల్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఈ కమిటీ నివేదికలో ఉండడం గమనించాల్సిన విషయమన్నారు.