25, మార్చి 2011, శుక్రవారం
'దొంగల ముఠా'గా..శ్రీకృష్ణ కమిటీ...
'దొంగల ముఠా'గా..శ్రీకృష్ణ కమిటీపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ఎంపి పొన్నం ప్రభాకర్ . శ్రీకృష్ణ కమిటీపై తెలంగాణ ప్రజల్లో నమ్మకం లేదని, ఐదో, పదో పైసల వంతు గౌరవం ఉండేదని, ఇప్పుడు శ్రీకృష్ణ 8వ అధ్యాయం ద్వారా ఆ గౌరవం కూడా పోయిందన్నారు. సీమాంధ్ర నాయకులు ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో ప్రపంచానికి తెలియజేశారని, వారి కుటిల బుద్ధికి ఇదొక నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. ఇంత అన్యాయంగా ఉద్యమాన్ని ఎలా మేనేజ్ చేయాలి, పత్రికలను ఎలా మేనేజ్ చేయాలి అనే విషయాలను సూచించి, మీడియాపై ఉన్న గౌరవాన్ని తగ్గించేదిగా ఉందంటూ ధ్వజమెత్తారు. విద్యలో, నీటి పారుదలలో, ఉద్యోగాలలో తెలంగాణాకు ఎంత అన్యాయం జరిగిందో కమిటీ ప్రస్తావించకపోవడం సిగ్గుచేటని, ఇది కేవలం సీమాంధ్రుల కన్సల్టెంట్ ఏజెన్సీగా వ్యవహరించినట్లుగా కమిటీ నివేదిక ఉండడం దౌర్భాగ్యమన్నారు