25, మార్చి 2011, శుక్రవారం

టేలర్‌ అందగత్తా...నాన్‌సెన్స్‌!

హరిలాల్‌కు గాంధీగారంటే ఎనలేని అభిమానం. ఒకసారి లోహియాను గాంధీగారి వద్దకు తీసుకువెళ్ళాడు. ఆ తరువాత ఒకటికి రెండుసార్లు గాంధీగారిని కలిసే అవకాశం లోహియాకు కలిగింది. బాపూతో సాహచర్యం లోహియాకు ఒక కొత్త ఊపునిచ్చింది. స్వరాజ్య ఉద్యమం పట్ల అభిమానం ముమ్మరమైంది. గాంధీకి ఉన్న ఆధ్యాత్మిక ధోరణి, నిగ్రహ శక్తి చూసి లోహియా ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. గాంధీ అడుగుజాడలలో నడిచే లోహియా తన పదవయేటనే సత్యాగ్రహ ఉద్యమంలో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగాడు. 1921లో జవహర్లాల్‌ నెహ్రూతో లోహియాకు పరిచయమైంది. ఆ తరువాత కాలంలో ఆయనతో గాఢమైన స్నేహానుబంధం ఏర్పడింది. అయినా నెహ్రూతో రాజకీయంగా ఎప్పటికపðడు విభేదించే వాడు. ఆయన రాజకీయ ఆలోచనలు నచ్చేవి కావు. అందుకని కీలకమైన ఏ అంశంపైనైనా నెహ్రూను తూర్పారబట్టేందుకు వెనకాడేవాడు కాడు. సైమన్‌ కమిషన్‌ గోబ్యాక అంటూ నినదించి ఉద్యమాన్ని నడిపించాడు. స్వతంత్ర పోరాటాలలో ఇలా తలమునక లుగా ఉంటూనే ఇంటర్మీడియెట్‌, మెట్రిక్యులేషన్‌లలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై తన చదువులలో తన సత్తా చాటుకున్నాడు. 1929లో జర్మనీ వెళ్ళాడు. అక్కడి జాతీయ అసెంబ్లీలో మన దేశ ప్రతినిథిగా బికనూర్‌ రాజా ఉండేవాడు. తెల్లదొరల తొత్తుగా ఉన్న ఆయన నిర్వాహకాన్ని నిరసిస్తూ మన దేశానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతూ విజటర్స్‌ గ్యాలరీ నుంచే నినాదాలు చేశాడు. అక్కడి భారతీయులు ఒక సంఘంగా ఏర్పడేందుకు సాయం చేసి ఆ సంఘానికి కార్యదర్శిగా వ్యవహరించాడు. గాంధీగారి ఉపðసత్యా గ్రహం పై పరిశోధన చేసి పిహెచ్‌డి తీసుకున్నాడు. ఈ ప్రయత్నం సాక్షిగా ఆయన గాంధీగారి సామాజిక ఆర్థిక కోణాలను విపులంగా చర్చించి దేశ విదేశాలలో పెద్దయెత్తున చర్చకు దారి తీశాడు.

స్వదేశానికి తిరిగి వచ్చాక సోషలిజం వైపు మొగ్గుచూపి 1934లో సోషలిస్టు కాంగ్రెస్‌ పార్టీని ఏర్పాటు చేశాడు. 1936లో ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీకి ఎన్నికయ్యాక విదేశీ వ్యవహారాల కమిటీని ప్రారంభించాడు. నెహ్రూ ఈ కమిటీకి తొలి కార్యదర్శిగా నియమించాడు. అనేక సవాళ్ళకు తట్టుకుని బలంగా నిలిచిన మన విదేశాంగ విధానానికి శ్రీకారం చుట్టింది లోహియానే! సత్యాగ్రహించండి అంటూ గాంధీగారు నడిపే హరిజన్‌ పత్రికలో వారం రోజుల ధారావాహిక వ్యాసపరంపర రాశాడు.

దీన్ని తపðగా నిర్ణయించి తెల్ల మెజిస్ట్రేట్‌ రెండేళ్ళ జైలు శిక్ష విధించినా లోహియా గురించి వ్యాఖ్యానిస్తూ 'లోహియా టాప్‌క్లాస్‌ మేధావి. సంస్కారవంతుడు. స్వేచ్చా మయ భావాలున్నవాడు. గొప్ప నైతిక విలువలున్నవాడు' అని కీర్తించాడు. గాంధీగారు కూడా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో మాట్లాడుతూ లోహియా జైలులో ఉన్నంత కాలం నా మానాన నేను ఉండలేను.

ఆయన కన్నా సాహసవంతుడు, ఆయన కన్నా నిరాడంబరుడు మరొకడు ఇంత వరకు నా కంట పడలేదు. ఆయన ఎన్నడూ హింసావాదాన్ని రెచ్చగొట్టలేదు. ఆయన చేసిన పనులన్నీ ఆయన గౌరవ మర్యాదలను పెంచాయి' అన్నారు. లోహియాను జైలర్లు మానసికంగా, శారీరకంగా ఎంతగానో హింసించేవారు. వలస పాలకుల దాష్టీకం పోవాలంటే రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం పోయి దేశాలు విముక్తం కావాలి. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాలలో స్వేచ్ఛ అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశంలో రాష్ట్రాలు సర్వ సౌభాగ్యాలతో తులతూగాలి. పోలీసుల అవసరం రాకుండా జనజీవితం హాయిగా సాగిపోవాలి అని లోహియా మనసా కోరుకున్నాడు.

-డాక్టర్‌ వంగల రామకృష్ణ