శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, ఈ 8వ అధ్యాయంలో తెలంగాణ, సీమాంధ్రలు కలిసి ఉండడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేసిందని, ఇది హర్షణీయమన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మినహా కేంద్ర ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయమే లేదన్నారు. ఈ నివేదికలోని కొన్ని అంశాలు మాత్రమే బయటకు వచ్చాయని, అన్ని అంశాలు బయటకు వస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంలో పొందుపరిచిన అంశాలను తాము స్వాగతిస్తున్నామని,..8వ అధ్యాయాన్ని సంపూర్ణంగా బహిర్గత పరచాలని ఆయన సూచించారు.