శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లిలో తలపెట్టిన ఈస్ట్‌కోస్ట్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్ ఆదేశించారు. మంగళవారం రాజ్యసభలో కాకరాపల్లి కాల్పుల ఘటనపై జరిగిన చర్చలో కాల్పులు జరిగేంత వరకు పరిస్తితి వెళ్ళడం ఆందోళనకరమని వ్యాఖ్యానిస్తూ.. జరిగిన ఘటన పై పూర్తీ స్తాయి విచారణ జరపాలని ఆదేశాలిచ్చారు.
విద్యుత్ ప్లాంట్‌కు అనుమతులు లేవని, అనుమతులు లేకుండా నిర్మాణం ఎలా చేపడతారని.. ప్లాంట్ యాజమాన్యం పర్యావరణ నిబంధనలు పాటించలేదని..ప్లాంట్ వ్యవహారంపై సాయంత్రంలోగా నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.