వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశ రాజధాని బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర క్రితం ముగింపుతో పోలిస్తే 150 రూపాయలు పెరిగి 50,700 రూపాయలకు చేరి సరికొత్త గరిష్ఠస్థాయిని నమోదు చేసింది. వారాంతంలో డెలివరీ అయ్యే వెండి ధర 755రూపాయలు పెరిగి 51,200 రూపాయలకు చేరింది. ఇదే సమయంలో బంగారం ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. మంగళవారం నాడు పది గ్రాముల బంగారం ధర 110 రూపాయలు పడిపోయి 21,070 రూపాయలకు చేరింది. ఆభరణాల బంగారం 10 గ్రాములకు 20,950 రూపాయల వద్ద కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 0.7 శాతం పెరిగి 34.11 డాలర్లకు చేరింది.