ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు కె.భాగ్యరాజ్ అందించిన కథ, స్క్రీన్‌ప్లేతో చంద్ర మహేష్ దర్శకత్వంలో రూపొందుతున్న పూర్ణచంద్ర మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం కోసం ఒక రోజు షూటింగ్ మినహా పూర్తయింది. నల్ల మోతు విజయ్ సమర్పణలో, లోక రమేష్‌రెడ్డి, గూడూరు జీవితరెడ్డి, ఆముదాల దేవేశ్ ఈ చిత్రానికి నిర్మాతలు. శంతన్ భాగ్యరాజ్, అంద్రిత నాయికలుగా నటిస్తున్నారు. ప్రత్యేక పాత్రలో కె.భాగ్యరాజ్ నటిస్తున్నారు. ఈనెల మొదటివారంలో టైటిల్ లోగోను ఆవిష్కరిస్తారు. మూడవ వారంలో ఆడియోను, ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు ప్రకటించారు.
ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, షాయాజీషిండే, ఎమ్మెస్. నారాయణ, సత్యప్రకాష్, కౌశ, సన, అన్నపూర్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: ఎ.విజయ్‌కుమార్, ఫైట్స్: హార్స్‌మెన్‌బాబు.