తెలంగాణ ఉద్యమం అదుపు తప్పకముందే కేంద్రం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించక పొతే రాజస్థాన్‌లో గుజ్జర్ల తరహాలో నిరవధిక రైలురోకోలు చేస్తామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరించారు. మౌలాలీలో మంగళవారం రైలు రోకో కార్యక్రమంలో పాల్గొని కాసేపు రైలుపట్టాలపై వాలీబాల్ ఆడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శాసనసభలో తెలంగాణ, సీమాంధ్ర సభ్యులు కలిసి కూర్చునే పరిస్థితి లేదన్న విషయాన్ని కేంద్రం గుర్తించాలని అన్నారు. 5 వ తీదీన కాంగ్రెస్ ఎమెల్యే జేసీ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సీమంధ్ర నేతల భేటీని అడ్డుకుంటామని..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుకోవటానికి ప్రయత్నిస్తే సీమాంధ్ర ప్రజాప్రతినిధులను, పెట్టుబడిదారులను హైదరాబాద్‌లో తిరగనివ్వమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరించారు.