తెలంగాణా అంశం రాత్రికి రాత్రి పరిష్కారమయ్యే అంశం కాదని దానికీ కొంత సమయం పడుతుందని అన్ని పార్టీల నేతలు గ్రహించాలని కేంద్ర మంత్రి చిదంబరం తేల్చి చెప్పారు. మంగళవారం ఆయన న్యూ డిల్లిలో మీడియాలో మాట్లాడుతూ...ఇప్పటికే శ్రీ కృష్ణ కమిటీ అందించిన నివేదికని కేంద్రం అన్నివిధాల పరిశీలిస్తోందని... చెప్తూ... అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసే విషయంపై అడిగిన ప్రశ్నకు వారంతా
ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడంటూ సమాధానమిచ్చారు. తెలంగాణా సమస్య పరిష్కారానికి అంతా ఊపికతో సహకరించాలని, శాంతి భద్రతకు విఘాతం కలిగించవద్దని సూచించారు చిదంబరం.