రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి అందించిన నివేదిక లోపభూయిష్టంగా ఉందని కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న జస్టీస్ శ్రీకృష్ణపై రాష్ట్రహైకోర్టు జడ్జి ఎల్.నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేశారు.
ఈమేరకు జడ్జిపై చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీకి ఫిర్యాదు చేశారు. సమన్యాయం పాటించాల్సిన జడ్జిగారు చేసిన వ్యాఖ్యలు ఒక ప్రాంతానికి మద్దతుగా ఇచ్చేలా ఉన్నాయని, దీని వల్ల న్యాయవ్యవస్థలోనూ ప్రాంతీయ అసమానతలు ఉన్నాయని వెంటనే రాష్ట్రాన్ని విడగొట్టాలని వాదన చేస్తున్నవారికి బలం చేకూర్చడం సమంజసమని అడుసుమిల్లి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.