మొబైల్ కస్టమర్లు ఎదుర్కొంటున్న అవాంఛిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌లపై కొత్త విధానం అమలు మరోసారి వాయిదా పడింది. తొలుత ఫిబ్రవరి 1 వరకూ గడువు పెట్టిన ట్రాయ్ దాన్ని మార్చి 1కి పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీన్ని ఈ నెల 21 వరకూ పొడిగిస్తున్నామని, కొత్త నిబంధనలు మార్చి ఆఖరి వారం నుంచి అమలయ్యేలా చూస్తామని ట్రాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిక్సెడ్ ఫోన్లకు కొత్త నెంబర్ సిరీస్‌ను త్వరలోనే డాట్ విడుదల చేస్తుందని వివరించింది.