ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకటరమణ ఇటీవల కాలధర్మం చెందిన విషయం తెలిసిందే. బాపు, రమణ కలిస్తే అచ్చతెలుగు సినిమా. వీరి కాంబినేషన్‌లో ఎన్నో ఆణిము త్యాలనదగిన చిత్రాలు వచ్చాయి. తాజాగా వీరిద్దరు కలిసి 'శ్రీరామరాజ్యం' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నందమూరి బాలకృష్ణ రాముని గా, అక్కినేని వాల్మికిగా నటిస్తున్నారు. రమణకు ఇది చివరిచిత్రం. ఈ చిత్రం కోసం ఆయన అహర్నిషలు కృషి చేశారు. ఆయనలేని లోటు తీర్చలేనిది. ఆయన జ్ఞాపకార్థం ఈ చిత్రాన్ని ముళ్లపూడికి అంకితం ఇస్తున్నామని నిర్మాత సాయిబాబు ప్రకటించారు. జూన్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకువస్తుంది అని ఆయన తెలిపారు.