టాటా నానో ప్లాట్‌ఫాంపై కేవలం మూడు మీటర్ల పొడవున్న సరికొత్త చిన్న కారు 'పిక్సెల్'ను టాటా మోటార్స్ ప్రదర్శించింది. 81వ మోటార్‌షోలో టాటా మోటార్స్ గ్రూప్ సంస్థల సిఇఒ కార్ల్ పీటర్ ఫ్రోస్టర్ పిక్సెల్‌ను ఆవిష్కరించారు. నాలుగు సీట్ల ఈ కారు చిన్న కుటుంబానికి సరిగ్గా సరిపోతుందని, రద్దీ నగరాల్లో ట్రాఫిక్ చిక్కులను తప్పిస్తుందని ఆయన తెలిపారు.