తెలంగాణలోని రజక మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా 'జై బోలో తెలంగాణ 'సినిమాలో పదాలను ఉపయోగించారని, వాటిని తక్షణం తొలగించాలని లేని పక్షంలో ఆ చిత్రం నడుస్తున్న సినిమాహాళ్ళముందు ఆందోళన చేస్తామని తెలంగాణ రాష్ట్ర రజక సంఘం ఆ సినిమా దర్శకుడు ఎన్. శంకర్‌ను హెచ్చరించారు.
రజక సంఘం అధ్యక్షుడు పూసాల సంపత్ పూసాల సంపత్ మాట్లాడతూ రజకమహిళలను అవమానపరిచేలా పదాలు ఉపయోగించారని, తెలంగాణలోని 25 లక్షల రజకుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శంకర్‌ను, ఈ చిత్రానికి పరోక్షంగా పెట్టుబడి పెట్టిన కేసీఆర్‌లను తెలంగాణలో తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు.