8, ఫిబ్రవరి 2011, మంగళవారం

సొమ్ము వచ్చింది.. సిఎం సీటు పోయింది...

కాంగ్రెస్‌ నేతలకు వివిధ పధకాల ద్వారా దోచి పెట్టేందుకు ఈ రాష్ట్ర సర్కారు వద్ద సొమ్ములుంటాయి కానీ, విద్యార్ధులని, పేదప్రజల్ని, రైతుల్ని, కార్మికుల్ని ఆదుకునేందుకు మాత్రం ఒక్క పైసా కూడా ఉండ దని ఎద్దేవా చేసారు తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.

మంగళవారం గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న రైతు కోసం యాత్రలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుని..ఆ పాపపుసొమ్ము పంపకంలో సోనియాకు కూడా వైఎస్‌ వాటాలు పంపారని...వైఎస్‌ మరణానంతరం వారసత్వంగా వచ్చిన అవినీతి సంపాదనతో పాటు ముఖ్యమంత్రి పీఠం కూడా కావాలని కోరుకుంటున్నాడని విమర్శించారు. అవినీతి సొమ్ము అందినా జగన్‌ వ్యవహ రాలు తెలిసినందువల్లే సిఎం పీఠం దక్కకుండా ఆపార్టీ నేతలే అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు.


జలయజ్ఞం పేరుతో కాంట్రాక్టర్లకు, గుత్తేదార్లకు కోట్లు కుమ్మరించి కమీషన్లుల కొటే్టసన ఘనుడు వైఎస్‌ అని.. తన పుత్రరత్నం కంపెనీలో వాటాలు కూడా పెట్టించి.. ఖజానాని లూటీచేసారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్ధలు పనిచేయక పోవటంతో జనం తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాని పరిస్ధిðతి నెలకొందని విమర్శించారు.
యుపిఏ సర్కారు అవినీతిలో పూరిగా మునిగి తేలుతోందని... తాజాగా ఇస్రోలో కూడా రెండు లక్షల కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నా ప్రధాని, సోనియా మౌనంగా ఉండటం వెనుక అంతరా ర్ధం ఏమిటన్నారు.