అవినీతి సర్కారుకి మహారాణిగా వెలుగొందుతున్న సోనియా అవినీతి గుట్టురట్టవుతుందన్న భయంతోనే దేశంలో నల్లధనం ఉన్నవారి వివరాలను, స్వీస్ బ్యాంకు ఖాతాదారుల చిట్టాను బైటకు చెప్పలేమని చెప్పడం వెనుక అప్పటికి గానీ కేంద్ర అవి నీతి పరుల చిట్టా బైటపెట్టేందుకు నిరాకరిస్తోందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు ధ్వజమెతారు.
కేంద్ర సర్కారు జగరుతున్న కుంభకోణాల గురించి ఎందుకు మాట్లాడటంలేదని దేశంలో జరుగుతున్న అవినీతినంతటికి బాధ్యత కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీదేనని... ఆమె ఇక్కడి సొమ్మంతా ఇటలీకి తరలిస్తున్నారని ఆరోపించారాయన.
అందుకే తాను నేతృత్వం వహిస్తున్న యుపిఏ సర్కారులో కామన్‌వెల్త్, 2-జి లాంటి స్కాము లు బైట పడ్డా లక్షల కోట్లు మేసేసరని తెలుసున్నా...ఇప్పుడు సాక్షాత్తు ప్రధాని నిర్వహిస్తున్న శాఖలోనే ఎస్-బాండ్ కుంభకోణం జరిగి 2లక్షల కోట్లమేర నష్టం జరిగిందని ఆరోపణలు వస్తున్న మిన్నకుంటున్నారని విమర్శించారు.
ఇటలీలోని సోనియాగాంధీ బంధువులు బ్యాంకు ఎకౌంట్లని సీజ్ చేసి బారత్ నుండి ఎంతెంత మొత్తాలు వచ్చి చేరాయో ఆరాలు తీస్తే... సోనియా చేతివాటానికి జరిగిన అవినీతి ఏ పాటిదో తెలుస్తుందని వ్యాఖ్యానించారు గాలి.