సీక్వెల్ పిచ్చ తెలుగు సినీ పరిశ్రమకి బాగానే పట్టుకున్నట్లుంది. ఇప్పటికే గతంలో తీసిన దేవదాసు సీక్వెల్ దేవదాసు మళ్లీ పుట్టాడు విజయాన్ని చవిచూసానని...ఇప్పుడే సర్ధార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, ప్రేమాభిషేకం ఇలా వరుస సినిమాలకు సీకెల్స్ నిర్మించాలని పదే పదే ప్రకటిసున్న దాసరి తాజా గా తనదృష్టి ‘ఒసేయ్.. రాములమ్మ”దగ్గర ఆపినట్లుంది.
దాసరి, విజయశాంతిల కాంబినేషన్‌లో వచిచ్చన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేయగా ఇదే చిత్రానికి సీక్వెల్ కధను రడీ చేసుకున్న దాసరి రామసక్కని తల్లి” అని పేరు కూడా ఖరారు చేసు కున్నట్లు సమాచారం.
పరమవీరచక్ర ఊహించని విధంగా తిరుగుటపా కట్టేయటంతో విజయశాంతి దాసరిపై కొంత అప నమ్మకంతో ఉన్నప్పటికీ కధ బాగా రావటంతో పాటు దాసరి వివరించిన పలు సీన్లు తన రాములమ్మ పేరు సార్ధకత చేస్తుందన్న నమ్మకంతో విజయశాంతి సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నలిచ్చినట్లు తెలుసోర్తంది..