8, ఫిబ్రవరి 2011, మంగళవారం

మార్చి13న ఎమ్మెల్సీ ఎన్నికలు

శాసన మండలి లో ఆరు స్థానాల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. ఈనెల 15న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. 22వ తేదీన నామినేషన్లు స్వీకరిస్తారు. 23న నామినేషన్లను పరిశీలిస్తారు. 25వ తేదీ సాయంత్రం వరకు నామినషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇస్తారు. మార్చి13న ఎన్నికలు నిర్వహించి మార్చి 15న ఓట్ల లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తమ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. కడప జిల్లా ఎమ్మెల్సీగా ఉన్న మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి పదవీ కాలం పూర్తి కానుండటంతో ఈ ఎన్నికలు కీలకంగా మారనుంది. వైఎస్‌ జగన్‌ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.