8, ఫిబ్రవరి 2011, మంగళవారం

సరైన బేరం కుదిరితే తెరాస కాంగ్రెస్‌లోకి ఖాయం : గౌడ్‌

తాము ప్రత్యేక తెలంగాణా కోసమే పోరాడుతున్నామని చెప్పు కుంటున్న తెలంగాణా రాష్ట్ర సమితి తన ఆశయాన్ని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఉండకుండా చూసేందుకు కాంగ్రెస్‌ పార్టీకి బ్రాంచ్‌ ఆఫీస్‌గా వ్యవహరిస్తోం దని... ఈమేరకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని... కొన్నాళ్లు పోయాక తెరాస కాంగ్రెస్‌లో విలీనం అయినా ఆశ్చర్యపోనఖ్ఖర్లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవేంద్రగౌడ్‌ విమర్శించారు.

సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాలో మాట్లాడుతూ...తెలంగాణా కోసం పోరా టం చేసేందుకు ప్రత్యేక జేఏసీ ఉన్నప్పటికీ అన్ని పార్టీల వారిని తెరాసలోకి ఆహ్వానిస్తూ... గత ఆరు నెలలుగా కేసీఆర్‌ చేస్తున్న పర్యటనలు చేస్తు తన పార్టీ బలాన్ని పెంచుకోవాలన్న వ్యూహమేనని విమర్శించారు. తెలంగాణాలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్‌ని తెలంగాణ పేరు చెప్పి ఏమార్చాలని చూస్తు... రానున్న ఎన్నికల్లో కొద్దో గొప్పో సీట్లు సాధించు కునేందుకు కేసీఆర్‌ ఎత్తుగడలను జనం గమనిసు్తన ఉన్నారని... వాటిని తిప్పి కొట్టే రోజులు త్వరలో వస్తాయన్నారు. రాష్ట సాధనే లక్ష్యం గాలికొదిలేసి.. ఓట్ల కోసం, సీట్ల కోసం ఉద్యమాన్ని వాడుకోవటం ప్రారంభించిన కేసీఆర్‌ సరైన బేరం కుదిరితే తెరాసని కాంగ్రెస్‌లో విలీనం చేస్తాడని వ్యాఖ్యానించారు దేవేంద్రగౌడ్‌.