మెట్రో రైలు ప్రోజక్టుతో రాష్ట్ర రాజధానికి మహోన్నత స్ధానం కలిపించాలని భావించిన సర్కారుకు మరోఅడ్డంకి ఎదురైంది. ఈప్రోజక్టు నిలపివేయాలంటూ మంగళవారం రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ ఒకటి దాఖలైంది. దీనిని విచారణకు స్వీకరించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్ధానం ఇందుకు సంబంధించిన వివరాలు దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.