మొన్న ప్రజారాజ్యం పార్టీ అధినేతగా హస్తినకి వెళ్లి... నేడు కాంగ్రెస్ నేతగా హైదరాబాద్ వచ్చిన చిరంజీవికి ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల కన్నా కాంగ్రెస్ నేతలే ఘనస్వాగతం పలికేం దుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు.
మంగళవారం శంషాబాద్ విమానాశ్రయంలో చిరంజీవికి స్వాగతం పలికేందుకు వచ్చిన పీఆర్పీనేతల్ని సైతం పక్కకునెట్టి చిరంజీవితో కరచలనంచేసేందుకు కాంగ్రెస్ నేతలు ఉత్సాహం చూపించడం ఆకట్టుకుంది. ఓదశలో తోపులాట జరిగే సూచనలు కనిపించడంతో చిరంజీవి వాహనం పైకి ఎక్కి అందరికీ అభివాదం తెలుపుతూ ముందుకు సాగిపోయారు.