8, ఫిబ్రవరి 2011, మంగళవారం

బాబు, కేసీఆర్‌లు వచ్చినా చేర్చుకొంటాం..

ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కావాలనే ఆరాటంతో పార్టీలు పెట్టుకుంటూపోతే దేశంలో చీలికలు ఏర్పడే ప్రమాదముందని కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. కుల, మత ద్వేషాల కంటే ప్రాంతీయ ద్వేషాలు ప్రధాన సమస్యగా మారిపోయిందన్నారు. రోజుకో పార్టీ పుట్టుకొస్తున్న నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలన్నీ.. ప్రాంతీయ వాదాన్ని పక్కనబెట్టి జాతీయ పార్టీతో విలీనమయ్యే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌ వచ్చినా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటామని 2014లో వై.ఎస్. జగన్మోహన రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని అన్నారు.

రెండు సంవత్సరాల ప్రయత్నం కాంగ్రెస్‌తో పీఆర్పీ విలీనం సఫలమైందన్నారు. ప్రజాశ్రేయస్సు కోసమే చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని విలీనం చేశారని .. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ప్రాంతీయ పార్టీలన్నీ జాతీయ పార్టీలో విలీనం కావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడాన్ని విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని.. విపక్ష నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని లగడపాటి వ్యాఖ్యానించారు.