పోలవరం ప్రోజక్టుపై పోరాటం చేసున్న వైఎస్ జగన్‌పై రాష్ట్ర మంత్రి డి.ఎల్ రవీంద్రారెడ్డి విమర్శలు గుప్పించడంపై జగన్ వర్గ నేత, మాజీ ఎంపి భూమా నాగిరెడ్డి విరుచుకు పడ్డారు.
మంగళవారం ఆయన మైదుకూరు నియోజకవర్గంలో జగన్ వర్గ నేతలు కార్యకర్తలతో తాసిహల్దార్ కార్యాలయంఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం మీడియా మాట్లాడుతూ... అక్రమకేసులు బనాయించి జగన్ వెంట కాంగ్రెస్ కార్యకర్తలు రాకుండా చూసేందుకు ప్రయ త్నాలు చేస్తున్నారని..జగన్ ముందు వారి ఆటలు సాగవన్న భయం కాంగ్రెస్ నేతల్లొ నెలకొం దని విమర్శించారు.
ఏనాడో ప్రజల్లో మద్దతు కోల్పోయిన రవీంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మైదుకూరు నియో జకవర్గంలో రానున్న ఉపఎన్నికల్లో మెజార్టీ తీసుకువస్తామని లేదంటే తాము రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్దంగా ఉన్నామని.. మరి డిఎల్ కూడా తన మంత్రి పదవికి రాజీ నామా చేసి రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్దమవుతారా? అని సవాల్ విసిరారు.