ప్రభుత్వం ఊగిసలాడే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి తమ అవసరం వచ్చిందని ఇటీవల ఆ పార్టీలో విలీనమైన పీఆర్పీ అధినేత నేత చిరంజీవి స్పష్టం చేశారు. విలీన ప్రతిపాదన కాంగ్రెస్ నుంచే ముందు వచ్చిందని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనతోపాటు వచ్చే నేతలకు మంచి భవిష్యత్ ఉంటుందని, విలీన బహిరంగ సభ త్వరలో భారీ ఎత్తున నిర్వహిస్తామని చెప్పారు.
తాను ఇప్పటికీ సమైక్యవాదినేనని, అయితే కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.