ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేయటం మార్పు కోసమేనని తన చర్యల్ని సమర్ధించుకున్నారు తాజా కాంగ్రెస్ నేత చిరంజీవి.
విలీన తతంగాన్ని ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి తనకి స్వాగతం పలకడానికి వచ్చిన అభిమానులు, నేతలనుద్దేశించి మాట్లాడుతూ అందరికీ సమానన్యాయం చేకూర్చేందుకు తనశక్తికి తోడు మరింత బలీయమైన శక్తి అవసరమని గ్రహించాకనే కాంగ్రెస్‌లో విలీనం చేయాలని నిర్ణయించుకున్నా నని... స్పష్టం చేసారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత మాత్రాన గతంలో లేవదీసిిన ప్రజా సమస్యల్ని మర్చిపోతానని.. సమస్యల పరిష్కారానికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని అధినేత్రి సోనియా హామీ ఇచ్చారని.. సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి పరిష్కార దిశగా తీసుకెళ్తానని చెప్పారు.
ఇక నుండి బడుగు బలహీన వర్గాలను కాంగ్రెస్‌కి మరింత చేరువ చేసి రాష్ట్రంలో పటిష్టం చేస్తానని... ఇందుకోసం పార్టీలోని ప్రతి ఒక్కరు తనతో కలిసి రావాలని విజ్ఞప్తి చేసారు చిరంజీవి.