ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనలు అమల్లోకి రావడంతో వైఎస్‌ఆర్(కడప), వ్రిశీపొట్టీ శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో జరగవలసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి రచ్చబండ కార్యక్రమాలను రద్దు చేశారు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్న జిల్లాల్లో జరగవలసిన రచ్చబండ కార్యక్రమాలను కూడా రద్దు చేశారు. శాసన మండలిలో ఆరు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల కమీషన్ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.