ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయటంతో ఇన్నాళ్లు వెండితెరమీద మెగాస్టార్‌గా ఉన్న చిరంజీవి ఇప్పుడు కాంగ్రెస్‌లో కారెక్టర్ ఆర్టిస్టుగా మారి పోయాడని వాఖ్యానించారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు మంగళవారం ఆయన నెల్లూరులో మీడియాలో మాట్లాడుతూ... ఇప్పటికే మునిగి పోవటాని కి సిద్దంగా ఉన్న కాంగ్రెస్‌లోకి చిరంజీవి వెళ్లి మరింత భారమై ముంచేస్తాడు మినహా కాపాడే పరిస్ధితి ఏమాత్రం లేదని అన్నారు.
కేంద్రంలోని యుపిఏ సర్కారు, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు అవినీతితో గబ్బుకొడుతున్నా యని.. ఇప్పటికే 2జి కుంభకోణంతో కకలావికలం అవుతున్న కేంద్ర సర్కారుపై దానిని మించి న ఎస్-బాండ్ కుంభకోణం గురించి విని ప్రజలు నిర్ఘాంత పోతున్నారని వాఖ్యానించారు. రాష్ట సర్కారు గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌ని సరిగా అమలు పరచక పోవటం వల్లే విదార్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని... కాంగ్రెస్ నేత లు మాత్రం వేల కోట్లు భోంచేసి హాయిగా కాలం వెల్లదీస్తున్నా... ప్రధాని తనకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు వెంకయ్య.