ప్రజారాజ్యం పార్టీ అధినేత గా చిరంజీవి అంటే ప్రజల్లో ఉన్న క్రేజ్ ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్లాక పూర్తిగా పడిపోయిందని.. ప్రజారాజ్యంలో ఆయన చిరంజీవి..ఇక కాంగ్రెస్‌లో‘చిరు’జీవి మాత్రమేనంటూ ఎద్దేవా చేసా రు జగన్ వర్గనేత అంబటి రాంబాబు.
బుధవారం జగన్ హరిత యాత్ర సందర్భంగా వచ్చిన ఆయన కాసేపు మీడియాతో మాట్లాడుతూ... చిరంజీవి ఏలక్ష్యంతో పార్టీపెటుకునారో? దానిన ఎందుకు కాంగ్రెస్‌లో కలిపేసుకున్నాడో అర్ధంకాక ఆయన సినీ అభిమానులు సైతం విమర్శలు దిగుతుండటం చూస్తుంటే చిరంజీవి ఏ పరిస్ధితిలో ఉన్నా రో అర్ధం చేసుకోవచ్చన్నారు.
చిరంజీవి చరిష్మాను వాడుకుని కాంగ్రెస్ బతికి బట్ట కట్టాలని చూసి బేరసారా లు జరిపితే...కాంగ్రెస్ నైజం తెలిసికూడా చిరంజీవి పార్టీనిమూసేసి ఇన్నాళ్లు విమర్శించిన పార్టీలో కలిసిపోవటం విడ్డూరంగా ఉందని.. చిరంజీవి జనాలకి చూపిస్తానన్న మార్పు ఇదేనేమో అని వ్యాఖ్యానించారు.
2003లో వైఎస్ పాదయాత్రలో పాల్గొన్న నాకు.. ఇప్పుడు పోలవరం సాధన కోసం జగన్ చేసున్న పాదయాత్రలోనూ పాల్గొనే అదృష్టం కలిగిందని అందు కు ఆనందిస్తున్నానని పేర్కొన్నారు. జగన్ పెట్టే పార్టీ కోసం ప్రజలెంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనఖ్ఖరేదని... ఆయన త్వరలోనే తన తండ్రి సమాధి వద్దనే పార్టీపేరు ప్రకటించి ప్రచారానికి కూడా శ్రీకారం చుడ తారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు అంబటి.