20, మే 2011, శుక్రవారం
జేపీ సరిహద్దు దాటకుండా అడ్డు కోవాల
సమైక్యా వాది అయిన లోకసత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ రైతుల కష్టాల పేరుతో తెలంగాణ ప్రాంతంలో అడు గు పెట్టడాన్ని తెలంగాణ ప్రజలు స హించబోరని, జేపీ సరిహద్దు కూడా దాటకుండా తెలంగాణ వాదులు అడ్డు కోవాలని ప్రజా సంఘాల రాష్ట్ర జేఏసీ కో-కన్వీనర్ రమేష్‌యాదవ్ పిలుపుని చ్చారు.
ప్రభుత్వంపై తిరుగుబాటు చేయండి
'రైతులూ.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయండి' అని అన్నదాతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోళ్ల సమస్యను పరిష్కరించే వరకు రైతు చైతన్య యాత్రలకు వచ్చే మంత్రులను నిలదీయాలని సూచించారు. ప్రభుత్వం మెడలు వంచైనా రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఇందుకు అవసరమైతే దీర్ఘకాలిక ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ కావాలో... పార్టీ కావాలో తేల్చుకో
'ఏడాదిన్నర క్రితం కళింగ భవన్‌లో తెలంగాణ జెఎసి ఏర్పాటైన రోజు అన్ని పార్టీలు జెండాలు పక్కనబెట్టి కలిసి పోరాడాలని టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ తానే అందరికీ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు దానిని గాలికి వదిలి తన జెండా పట్టుకొని తిరుగుతూ తెలంగాణలో తన పార్టీ ఒక్కటే ఉండాలని...మిగిలిన పార్టీలు ఉండకూడదని ప్రయత్నం చేస్తున్నారు. కెసిఆర్ తన రాజకీయ లబ్ధి కోసమే చూస్తే ఏనాటికీ తెలంగాణ రాదు. తనకు తెలంగాణ కావాలో...తన పార్టీ కావాలో ఆయన తేల్చుకోవాలి' అని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు డిమాండ్ చేశారు. 'ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని తన కుటుంబ ఆస్తులు పెంచుకోవడం ఒకటే ఆయన చేశారు. తెలంగాణ పరువు పోతుందని మేం కెసిఆర్ విషయంలో మౌనం వహిస్తున్నాం. మేం నోరు తెరిస్తే తెలంగాణ ప్రజలు ఆయనను తరిమికొడతారు' అని ఆయన వ్యాఖ్యానించారు.
58వ జాతీయ చలన చిత్ర అవార్టుల ప్రకటన
జాతీయ చలన చిత్ర అవార్టులను కేంద్ర సమాచార ప్రసారశాఖ ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా ‘అదమంటే మకాన్ అబూ’, ఉత్తమ జనరంజక చిత్రంగా ‘దబాంగ్’ ఎంపికయ్యాయి. జాతీయ అవార్డులను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు జేపీ దత్తా ప్రకటించారు.
ఉత్తమ నటుడు: ధనుష్ (ఆదుకాలం), సలీం కుమార్ (అదమంటే మకాన్ అబూ)
ఉత్తమ నటి: మితాలీ జగ్‌తాప్ (బాబు బ్యాండ్ బాజా), శరణ్య పిరవనమ్
ఉత్తమ దర్శకుడు: వెట్రిమాలన్ (ఆదుకాలం)
ఉత్తమ ఫోటోగ్రాఫర్: మధు అంబట్
ఉత్తమ సంగీత దర్శకుడు: విశాల్ భరర్వాజ్ (ఇష్కియా)
ఉత్తమ ఎడిటర్: కిషోర్
ఉత్తమ కళాదర్శకుడు: సాబు సిరిల్ (ఎంథిరన్)
ఉత్తమ గాయకుడు: సురేశ్ వాడ్కర్
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఎంథిరన్
ఉత్తమ నటుడు: ధనుష్ (ఆదుకాలం), సలీం కుమార్ (అదమంటే మకాన్ అబూ)
ఉత్తమ నటి: మితాలీ జగ్‌తాప్ (బాబు బ్యాండ్ బాజా), శరణ్య పిరవనమ్
ఉత్తమ దర్శకుడు: వెట్రిమాలన్ (ఆదుకాలం)
ఉత్తమ ఫోటోగ్రాఫర్: మధు అంబట్
ఉత్తమ సంగీత దర్శకుడు: విశాల్ భరర్వాజ్ (ఇష్కియా)
ఉత్తమ ఎడిటర్: కిషోర్
ఉత్తమ కళాదర్శకుడు: సాబు సిరిల్ (ఎంథిరన్)
ఉత్తమ గాయకుడు: సురేశ్ వాడ్కర్
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఎంథిరన్
19, మే 2011, గురువారం
విభజిస్తే ఒక ప్రాంతంలోనయినా మనుగడ
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కడప ఎంపీ వైఎస్ జగన్మోహనరెడ్డి కోవర్టు అని సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు... ఎంపీ రాజగోపాల్‌రెడ్డి కూడా జగన్‌కు ధన సాయంతో పాటు మనుషులను కూడా సరఫరా చేస్తూ అన్నివిధాలా సాయపడుతున్నారని ఈ ఇరువురి వల్ల జగన్‌కు బలమే తప్ప అధిష్ఠానానికి కాదన్నారు. విభజిస్తే ఒక ప్రాంతంలోనయినా మనుగడ సాగిస్తుందని పాల్వాయి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రులను మార్చి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తప్పుచేసిందని, ఉన్న వారి ద్వారానే సమర్థంగా పనిచేయించుకోవాలని ఆయన సూచించారు.
కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా ముకుల్ రాయ్
నూతన కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా ముకుల్ రాయ్ నియమితులయ్యారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పదవికి రాజీనామా సమర్పించడంతో మమత బెనర్జీ స్థానంలో ముకుల్ రాయ్‌కి స్థానం కల్పించారు. బెంగాల్ పదకొండవ ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనుండటంతో ఆమె కేంద్ర మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు.
మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో మరో పొరపాటు
కేంద్ర హోంశాఖ పాకిస్థాన్‌కు అందించిన మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో తప్పిదం దొర్లింది. 1993 ముంబై పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న ఫిరోజ్ అబ్దుల్‌ఖాన్ పేరును లిస్ట్‌లో ఉంచింది. ముంబై జైలులో ఉన్న ఫిరోజ్ పేరును సీబీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ నుంచి తొలగించడం మర్చిపోయిందని హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఆయన రాజీనామా ఎవరికిచ్చారు?
తెలంగాణ పాదయాత్ర చేపట్టిన మంత్రి జూపల్లి కృష్ణారావును తన నియోజకవర్గం గద్వాలలో అడుగు పెట్టనిచ్చేది లేదని మరో మంత్రి డికె అరుణ స్పష్టం చేశారు. నా అనుమతి లేకుండా రావడానికి వీలు లేదు, వస్తే అడ్డుకుంటాం అన్నారు. ఈ విషయాన్ని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లానని మంత్రి వివరించారు. ఎవరితోనూ కలవకుండా, ఎవరినీ సంప్రదించకుండా, వ్యక్తిగత ఎజెండాతో యాత్ర చేపట్టి, జిల్లాలో గ్రూపులు ప్రోత్సహిస్తున్నారంటూ.... మంత్రిగానే ఆయన పర్యటిస్తున్నారని విమర్శించారు. ఆయన రాజీనామా ఎవరికిచ్చారు? ఎవరు ఆమోదించారని ఆమె ప్రశ్నించారు.
రాష్ట్రంలో వ్యవసాయం పండగ
రైతుల సమస్యల పేరిట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న ఆందోళనలు, ధర్నాలు రాజకీయ డ్రామా కార్యక్రమాలుగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు అభివర్ణించారు. తెలుగుదేశం అధినేత రైతుల గురించి మాట్లాడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని,, తికిలపడిన తెలుగుదేశం పార్టీని తిరిగి నిలబెట్టుకునేందుకే సమస్యలను భూతద్దంలో చూపుతూ ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం సేకరణ విషయంలో విపక్షాలు చేస్తున్న ఆందోళనలు రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్, పావలా వడ్డీ రుణాలు, 13 వేల కోట్ల రుణ మాఫీ, కౌలురైతులకు రుణ సౌకర్యం, అందుబాటులో ఎరువులు, పొలంబడి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగలా మార్చిందన్నారు.
వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని రైతులకు ఏ సమ్యల వచ్చినా సత్వరమే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నా...రైతుల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాలు అర్థం లేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పితాని సత్యనారాయణ ఎద్దేవా చేశారు. వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబుకు రైతాంగం, వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. త డిసెంబరులో సంభవించిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. మరో వారం రోజుల్లో ఈ ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
చైనాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
చైనాలో ఎంబీబీఎస్ చదువుతున్న తెలుగు విద్యార్థి సత్య శ్రీనివాసరెడ్డి ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. మరో నాలుగు నెలల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు.
ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద తెలంగాణ జర్నలిస్టుల ధర్నా
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణపై బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత జర్నలిస్టులు గురువారం ఉదయం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ చాఫ్టర్‌ను బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఆందోళనకు పలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.
రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు
రైతు సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే నిమిత్తం గురువారం తెలుగుదేశంపార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు చేపట్టింది. రైతు సమస్యలను పరిష్కరించాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మహబూబ్‌నగర్‌జిల్లాలోని మరికల్‌లో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని దేవరకద్ర మార్కెట్‌యార్డును పరిశీలించి, అక్కడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బాంబ్రాగడ్ పోలీస్ స్టేషన్‌పరి«ధిలో గురువారం మధ్యాహ్నం మారంఘడ్- నారగొండ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు పేలి సీ-60 బలగాలకు చెందిన నలుగురు పోలీస్‌కానిస్టేబుళ్లు అ క్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనతో వెంటనే తేరుకున్న పోలీసులు మావోయిస్టులను వెంబడించి ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పులలో 15 మంది మావోయిస్టులు మృతిచెంది ఉంటారని అనుమానిస్తున్నారు.
17, మే 2011, మంగళవారం
నాగార్జునకు తప్పిన విమాన ప్రమాదం
ప్రముఖ సినీనటుడు నాగార్జునతో సహా పలువురు వి.ఐ.సిలు తృటిలో విమాన ప్రమాదం నుంచి బయటప ద్దారు. ఉదయం ఏడు గంటలకు బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం . శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరుతున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన సంగతిని గుర్తించిన విమాన పైలట్ వంటనే విమానాన్ని నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా విమానంలో కూర్చుని తలుపులు మూసి వేసిన తర్వాత ఈ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ముప్పు తప్పిందని విమానాశ్రయ వర్గాలు చెపుతున్నాయి .
12, మే 2011, గురువారం
ఆదర్శ్ కుంభకోణంలో మాజీ సీఎంలకు సమన్లు
కార్గిల్ యుద్ధవీరుల కుటుం బాల కోసం నిర్మించిన ఆదర్శ్ సొసైటీలోని ఫ్లాట్లను అనర్హులు దక్కించుకున్న నేపథ్యంలో వెలుగు చూసిన కుంభకోణం సెగలు రాజకీయ నాయకులను ఇంకా వీడడంలేదు. ఇప్పటికే ఈ కుంభకోణంతో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రులు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, అశోక్‌రావ్ చవాన్‌లకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. కుంభకోణం కేసును దర్యాప్తు జరుపుతున్న విచారణ మండలి వీరిరువురికి సమన్లు జారీ చేసింది. విచారణ మండలి ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఈ మాజీ ముఖ్యమంత్రులిద్దరికీ విచారణ మండలి ముందు హాజరుకావడం అనివార్యంగా మారింది.
సర్వేలతో జనం అయోమయం
తమిళ నాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత వచ్చిన కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రధాన పార్టీలైనా డీఎంకే, అన్నాడీఎంకే నేతలను ఊహా లోకాల్లో విహరించేలా చేస్తున్నాయి. కొన్ని సర్వేలు అధికార డీఎంకేకు అనుకూలంగా ఉంటే మరికొన్ని అన్నాడీఎంకే విజయం సాధిస్తుందని వచ్చాయి. వీటి ఆధారంగా గెలుపు తమదంటే తమదేనంటూ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సర్వేలు ఇలా ఉండడం వల్ల ఎవరు అధికారంలోకి వస్తారో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారు. హంగ్ వచ్చే అవకాశాలూ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
జయప్రదకు ‘లలిత కళా నటనా మయూరి’ బిరుదు
రాజ మండ్రిలో విరిసిన మల్లిక లాంటి సినీ నటి జయప్రద జాతీయ స్థాయికి ఎదిగి రెండుసార్లు ఎంపీ కావడం ఈ ప్రాంతానికే గర్వకారణమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బిరామిరెడ్డి ప్రశంసించారు. జయప్రదకు ‘లలిత కళా నటనా మయూరి’ బిరుదునిచ్చి సత్కరించారు. ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం, ఆలీ, ఊర్వశి శారద, వాణిశ్రీ, కొండవలస లక్ష్మణరావు, కథానాయికలు నికిషా పటేల్, కామ్నా జఠ్మలానీ, సలోనీ, సినీ నటులు హేమ, కవిత పాల్గొన్నారు. హాస్యనటులు తమ చతురోక్తులతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.
అంజిత ఐపీఎస్
నిర్మల్ పట్టణంకు చెందిన చెప్యాల అంజిత ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)కు ఎంపికయ్యారు. ఆమె 2007లో సివిల్స్ రాశారు. 1500 మార్కులకు 1217 సాధించారు. ఓబీసీలకు రిజర్వేషన్ శాతం పెంచడంతో ఓసీలకు అన్యాయం జరుగుతోందంటూ 90 మంది అభ్యర్థులు అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి ర్యాంకును బట్టి సర్వీస్‌లోకి తీసుకోవాలని గతనెల 26న కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు అంజిత ఢిల్లీ-అండమాన్ నికోబార్ క్యాడర్ ఐపీఎస్‌గా ఎంపికయ్యారు.
జూన్ 1 నుంచి ఉద్యమం ఉధృతం
రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జూన్ 1 నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు తెలంగాణ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ స్వామి గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా పది రోజుల పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బస్సు యాత్రలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. . ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 177 తెలంగాణ ఉద్యోగుల గొంతు నొక్కేదేనని ఆయన అభిప్రాయపడ్డారు. జీవో ఉపసంహరణకు ముఖ్యమంత్రి అంగీకరించి, నెలన్నర కావస్తున్నా.. సంబంధిత ప్రక్రియ పూర్తి కాలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులకు న్యాయం జరగాలంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కావాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు
గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు రాజీనామా
గిద్దలూరు ఎమ్మెల్యే(పీఆర్‌పీ) అన్నా రాంబాబు శాసన సభ్యత్వానికి బుధవారం ఉదయం రాజీనామా చేశారు. జలయజ్ఞం ముందుకు సాగటం లేదని, రెండేళ్లుగా తాను చేస్తానన్న పనులు ప్రజలకు చేయలేక పోయాననే ఆవేదనతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారాన్ని ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి అవలంబించిందని, వెలగలపాయ ప్రాంతం వారికి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించే ప్రతిపాదనలకు కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని, అందువల్లే రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొనట్లు తెలిసింది.
6, మే 2011, శుక్రవారం
అంబటి రాంబాబు.. కుక్కల గొడవ
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు మీడియాతో మంచి వాగ్దాటితో మాట్లాడుతారు..ఢిల్లీకి, కడపకు మధ్య పోటీ అని, సోనియాగాందీ అహంభావంతో తన.కుటుబాన్ని అవమానించిందని, కడప ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టిందని ఓ వైపు జగన్ ఆరోపిస్తుంటే అంబటి రాంబాబు మరూ అడుగు ముందేసి కడప ఉప ఎన్నికలు ఇటలీ సంస్కృతికి, తెలుగు సంస్కృతికి మద్య పోటీ అని వ్యాఖ్యానిస్తున్నారు.
తెలుగు నట ఐన వారు చనిపోతే పరమర్సించటం సాంప్రదాయం.. అది తెలియని సోనియా జగన్ ఓదార్పుయాత్రకు వెళుతుంటే అడ్డుకోన్నారని అందువల్ల ఇది ఇటలీ సంస్కృతికి, తెలుగు సంస్కృతికి మధ్య పోటీ అని ఆయన అన్నారు.
రాజమండ్రీలో కుక్క కాటు మరణం ని సైతం తనదైన శైలిలో ప్రచారంకి వదేసుకూవాలన్చి చుసారాయన రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదని, నిస్తేజంగా ఉందని,రాజశేఖరరెడ్డి పధకాలు ఏవీ అమలు కావడం లేదని.. పదవి కాపాడుకునే పనిలో కిరణ్కుమార్ రెడ్డి ఉన్నాడని ఆరోపిస్తూ.. రాజశేఖరరెడ్డి బతికి ఉంటే రాబిస్ వ్యాదికి గురై రాజమండ్రి బాలిక మరణించి ఉండేదా అని ఆయన ప్రశ్నించారు ఆస్పత్రులలో కుక్క కరిస్తే మందులు కూడా దొరకని దైన్య పరిస్థితి చేరుకోవటానికి వఎస్ మరణమే కారణమని... రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడు అంత సజావుగా ఉన్నట్లు , ఆస్పత్రలు అన్నీ మందులతో పుష్కలంగా ఉన్నట్లు తెగ వాగేసారు. ఆరోగ్య శ్రీ పేరుతొ సర్కారు దభాఖనాలని మూల పడేలా చేసింది ఎవరంటే మాత్రం ఆ విషయాలు తరవాత మాట్లాడు కొడం అంటూ చల్లగా జరుకున్నరీ నేత. ఇంకా నయం మహానేత అని తెగ దప్పలు గుప్పిస్తూ రాజశేఖరరెడ్డిని ఆకాసానికేతేస్తున్న నేతలు.. ఆయనే బతికి ఉంటే ఈ కుక్కలు మొరిగేవా? ఆ కుక్కలు కరిచేవా? అని నిలదీసేవాదేమో? చమత్కరిస్తున్నారు మారి కొందరు. ఆయెనే ఉంటే.. మీకీ పనికూడా ఉండేదా.. ఇప్పటికే రాష్ట్రాన్ని సగం తినేశారు గా... హ్యాపీ గా కూర్చొని తినేవాలుగా... ఆయన లేకనే దోచించి కాపాడే పని మీలాంటి విశ్వాసం ఉన్న వారు చేస్తున్నారని మరికొందరు సెటైర్లేస్తున్నారు.
తెలుగు నట ఐన వారు చనిపోతే పరమర్సించటం సాంప్రదాయం.. అది తెలియని సోనియా జగన్ ఓదార్పుయాత్రకు వెళుతుంటే అడ్డుకోన్నారని అందువల్ల ఇది ఇటలీ సంస్కృతికి, తెలుగు సంస్కృతికి మధ్య పోటీ అని ఆయన అన్నారు.
రాజమండ్రీలో కుక్క కాటు మరణం ని సైతం తనదైన శైలిలో ప్రచారంకి వదేసుకూవాలన్చి చుసారాయన రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదని, నిస్తేజంగా ఉందని,రాజశేఖరరెడ్డి పధకాలు ఏవీ అమలు కావడం లేదని.. పదవి కాపాడుకునే పనిలో కిరణ్కుమార్ రెడ్డి ఉన్నాడని ఆరోపిస్తూ.. రాజశేఖరరెడ్డి బతికి ఉంటే రాబిస్ వ్యాదికి గురై రాజమండ్రి బాలిక మరణించి ఉండేదా అని ఆయన ప్రశ్నించారు ఆస్పత్రులలో కుక్క కరిస్తే మందులు కూడా దొరకని దైన్య పరిస్థితి చేరుకోవటానికి వఎస్ మరణమే కారణమని... రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడు అంత సజావుగా ఉన్నట్లు , ఆస్పత్రలు అన్నీ మందులతో పుష్కలంగా ఉన్నట్లు తెగ వాగేసారు. ఆరోగ్య శ్రీ పేరుతొ సర్కారు దభాఖనాలని మూల పడేలా చేసింది ఎవరంటే మాత్రం ఆ విషయాలు తరవాత మాట్లాడు కొడం అంటూ చల్లగా జరుకున్నరీ నేత. ఇంకా నయం మహానేత అని తెగ దప్పలు గుప్పిస్తూ రాజశేఖరరెడ్డిని ఆకాసానికేతేస్తున్న నేతలు.. ఆయనే బతికి ఉంటే ఈ కుక్కలు మొరిగేవా? ఆ కుక్కలు కరిచేవా? అని నిలదీసేవాదేమో? చమత్కరిస్తున్నారు మారి కొందరు. ఆయెనే ఉంటే.. మీకీ పనికూడా ఉండేదా.. ఇప్పటికే రాష్ట్రాన్ని సగం తినేశారు గా... హ్యాపీ గా కూర్చొని తినేవాలుగా... ఆయన లేకనే దోచించి కాపాడే పని మీలాంటి విశ్వాసం ఉన్న వారు చేస్తున్నారని మరికొందరు సెటైర్లేస్తున్నారు.
4, మే 2011, బుధవారం
వివేకా గెలుపుతోనే పులివెందుల అభివృద్ధి : పురందేశ్వరి
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ అహంకారానికి, కడప ఆత్మగౌరవానికే ఉప ఎన్నికలు అన్న వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కేంద్రమంత్రి పురందేశ్వరి చెప్పారు. బుధవారం పులివెందులలో విలేకరులతో మాట్లాడుతూ. మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి తన తరఫున ప్రచారానికి రమ్మని చెప్పినందు వల్లే తాను పులివెందులకు వచ్చానని చెప్పారు. ఉప ఎన్నికల పోరులో కాంగ్రెసు గెలుపు ఖాయమని ...దశాబ్దాలుగా ప్రజలు కాంగ్రెసును అదరిస్తున్నట్టే ఇప్పుడు కూడా ఆదరిస్తారని...వైయస్ వివేకానందరెడ్డి గెలుపుతోనే పులివెందులలో అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఖండూ సహా ఐదుగురు మృతి
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండుతో పాటు మరో నలుగురు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఐదురోజుల క్రితం ఇటానగర్ వెళ్తుండగా ఖండూ ప్రయాణిస్తున్న హెలీకాఫ్టర్ అదృశ్యమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆర్మీ వర్గాలు ఖండూ ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు ప్రయాత్నాలు మొదలు పెట్టాయి. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా తవాంగ్లోని లోబ్తాన్ లో జంగ్ జలపాతం వద్ద కుప్పకూలినట్లు తెలుస్తోంది. దోర్జీఖండూ సహా అయిదుగురి మృతదేహాలు లభ్యం అయినట్లు, గుర్తుపట్టలేనంతగా, కుళ్లిపోయినట్లు తెలుస్తోంది. . కాగా దోర్జీఖండూ మృతిపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు.
2, మే 2011, సోమవారం
అక్బరుద్దీన్ ఆరోగ్య o మెరుగు..
నిన్న ప్రత్యర్ధుల కాల్పులలో గాయపడి కేర్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు సోమవారం బులెటిన్ విడుదల చేశారు. అక్బరుద్దీన్‌కు రక్తపోటు, నాడి క్రమంగా మెరుగుపడుతోందని.. వెంటిలేటర్ ద్వారా శ్వాస, మూత్రపిండాలకు డయాలసిస్ కొనసాగుతోందని తెలిపారు. కాగా... అక్బరుద్దీన్ పై దాడి చేసిన నిoదితులని పట్టుకొనేందుకు ప్రత్యెక పొలిసు బృందాలని ఎర్పాటు చేసి గాలిపు చర్యలు చేపట్ట్టినట్టు నగర పోలీసు కమీషనర్ ఎ.కే. ఖాన్ చెప్పారు.
లాడెన్ ని చంపేసాం : ఒబామా ప్రకటన
అమెరికా ట్విన్‌టవర్స్ పేల్చివేతతో తన సత్తా చూపి పదేళ్లుగా దొరకకుండా ముప్పుతిప్పలు పెట్టి, తప్పించుకు తిరుగుతున్న లాడెన్ ఎట్టకేలకు అమెరికా సైన్యం చేతిలో హతమయినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ ప్రకటన విడుదల చేస్తూ వాషింగ్టన్ కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11.30 గం.లకు లాడెన్ మరణించినట్లు ధృవీకరించారు. అమెరికా గూఢాచారి సంస్థలు చేసిన దాడులలో లాడెన్ హత మైనట్టు ఒబామా తన ప్రకటనలో వెల్లడించారు.లాడెన్ మృతి నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ విదేశాల్లోని తమ పౌరులను హెచ్చరిస్తూ.... విదేశాల్లోని తమ రాయబార కార్యాలయాలను అప్రమత్తం చేసింది. లాడెన్‌ను మట్టుబెట్టారనే ఆగ్రహంతో ఆల్ ఖైదా అమెరికా పౌరులపై దాడులు చేసే ప్రమాదం ఉందని తెలిపింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)