తిరుమలలోని శ్రీవారి ఆలయంలో 13వ తేదీన (శనివారం) పుష్పయాగం నిర్వహించనున్నారు... కార్తీక మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణం రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో శనివారం ఉదయం స్వామివారు ఉభయ నాంచారీలతో ఆలయ సంపగి ప్రాకారం ఉన్న కల్యాణమంటపానికి వేంచేస్తారు
దీనికిగాను టీటీడీ ఉద్యానవనశాఖ సుమారు మూడు టన్నుల పుష్పాలను సిద్ధం చేయనుంది. వివిధ రకాల పుష్పాలను దాతల నుంచి అధికభాగంలో సేకరిస్తున్నారు.. ఈ సేవలో భక్తులు రూ. మూడు వేలు ఆర్జితం చెల్లించి పాల్గొనవచ్చు.