ఈనెల 15 నుంచి గాలేలో వెస్టిండీస్‌తో మొదలయ్యే తొలి క్రికెట్ టెస్ట్‌కు గానూ శ్రీలంక ఫాస్ట్‌బౌలర్ లలిత్ మలింగను పక్కన పెట్టారు. ఇటీవల జూలై , ఆగస్టులో ఇండియాతో జరిగిన హోం సీరీస్‌కుగానూ రెండేళ్ళ విరామం అనంతరం టెస్ట్ జట్టులో చోటు చేసుకున్న మలింగను ఈ పర్యటనకు తప్పించారు. ఇండియాతో సీరీస్‌లో కూడా మలింగ తొలి టెస్ట్ మాత్రమే ఆడగా రెండో దానిలో విశ్రాంతి తీసుకున్నాడు. ఇక ఆఖరి టెస్ట్‌లో కేవలం ఆరు ఓవర్లే బౌలింగ్ చేసి తప్పుకున్నాడు. దాని తదుపరి స్వదేశంలోనే జరిగిన న్యూజిలాండ్, ఇండియాలతో జరిగిన ముక్కోణపు సీరీస్‌లో మాత్రం ఆడాడు.