20 వ తేదీన న్యూజెర్సీలో ఆంధ్రప్రదేశ్ ఎన్నారై సంస్థ ఇటు కాంగ్రెస్, అటు తెలుగుదేశం నాయకులను ఒకే వేదికపైకి తీసుకువస్తున్నది. సమైక్యాంధ్ర నినాదంతో క్రిందటి సంవత్సరం ఏర్పాటైన వేదిక చేపడుతున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొననున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నారై సంస్థ ప్రతినిధులు గురువారం ప్రకటించారు.
ఇప్పటికే శ్రీ కృష్ణ కమిటీకి ఓ నివేదిక అందించ్చామని ... సమైక్యాంధ్ర నినాదాన్ని మరింత గట్టిగా వినిపించడానికీ ఈ సభ నిర్వహించనున్నట్టు సంస్థ లో చురుకైన పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నారై సంస్థ అధ్యక్షురాలు శైలజ అడ్లూరు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎడిసన్‌లోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్‌లో ఈ సభ నిర్వహించనున్నట్టు ఆమె వెల్లడించారు.