11, నవంబర్ 2010, గురువారం

రాష్ట్రంలో అసమర్థుడి పాలన

రాష్ట్రంలో అసమర్థుడి పాలన సాగుతోంద ని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ సీఎం రోశయ్యపై ధ్వజమెత్తారు.
వయసు పైబడి సీఎం రోశయ్య అసహనం, కోపం ప్రదర్శిస్తున్నారన్నా రు. అపార అనుభవం ఉందని చెప్పుకు నే రోశయ్య ప్రజా సమస్యలు పరిష్కారానికి మా త్రం అనుభవం ఉపయోగించడం లేదన్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో టీడీపీ హయాంలో జరిగిన అనేక పథకాలు, కార్యక్రమాలపై 22 కమిటీలను నియమించారని ఏ ఒక్కటీ తప్పు పట్టలేదన్నారు.

ఏనాడూ ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేని రోశయ్య ... చెన్నారెడ్డిపై తీవ్ర విమర్శలు చేసి రాత్రికి రాత్రే ఆయన కేబినెట్‌లో మంత్రి అ య్యారన్నారు..వైఎస్ చనిపోయాక మెజారిటీ సభ్యులు జగన్ సీఎం కావాలని సంతకాలు చేసినా ఆ కుర్చీలో రోశయ్య ఎలా కూర్చున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించినపు డు, 1999లో జరిగిన ఎన్నికల్లోనూ అత్యధిక మెజారిటీతో చంద్రబాబు సీఎం అయ్యారన్నారు. సీ ఎంగా సొంత జిల్లాకే ఏమీ చేయలేని వ్యక్తి ర్రాష్టానికి ఏం చేస్తారన్నార ని నిలదీసారు ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ...