11, నవంబర్ 2010, గురువారం

ఆర్ఎస్ఎస్‌కు ఉగ్రవాద లేబుల్‌ను అతికిస్తారా?

ఆర్ఎస్ఎస్ తోపాటు ఇతర హిందూ సంఘాలపై బురద చల్లడానికి ప్రయత్నిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆరెస్సెస్ ప్రముఖులు పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

నిన్న ఇందిరాపార్క్ దరి ఎన్టిఆర్ స్టే డియంలో జరిగిన సమావేశం ఆద్యంతం ఉద్వేగ భరితంగా సాగింది. సమగ్రత, ఐకమత్యాన్ని సామాజిక సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి చర్యలకు పాల్పడరాదని పాల్గొన్న ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు..

హిందూమతోద్ధరణకు కంకణo కట్టుకున్న ఆర్ఎస్ఎస్‌కు ఉగ్రవాద లేబుల్‌ను అంటించడంపై తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తు కుతంత్రాలను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ఆరెస్సెస్ సిద్దంగా ఉందని అజ్మీర్, హైదరాబాద్, సంజోతా ఎక్స్ ప్రెస్‌లో బాంబ్ ప్రేలుళ్ళకు లష్కర్-ఎ-తోయిబా సంస్థలే కారణమన్న నిజాన్ని ప్రధానమంత్రి గుర్తించాలన్నారు