టిడిపి అధినేత నారాచంద్రబాబునాయుడు, పిఆర్‌పి నాయకులు చిరంజీవులు ప్రభుత్వంపై గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని 20 సూత్రాల కమిటీ చైర్మన్ డా.ఎన్.తులసిరెడ్డి మండిపడ్డారు.9 ఏళ్లు సిఎంగా పనిచేసిన బాబుకు అన్నీ తెలిసినప్పటికీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే పని... ఇక చిరంజీవి రాజకీయాలకు కొత్త అని, ఆయనకు రాజకీయ పరిజ్ఞానం లేదని కొట్టిపడేశారు.
రోశయ్య సిఎం హయాంలో 2010లో అత్యధికంగా రూ.1104 కోట్లు రాష్ట్రానికి నిధులు విడుదలైయ్యాయని, ఈ ఏడాది రూ.586 కోట్లు ప్రకృతి వైపరీత్యాల నిధి, జాతీయ విపత్తునిధి కింద నిధులు మంజూరు అయ్యాయని గణాంకాలతో ఆయన వివరించారు. తమ ఉనికిని చాటుకునేందుకు టిడిపి నేతలు రోశయ్య ప్రభుత్వంపై అసత్య ప్రచారానికి పూనుకున్నారని ఆయన విమర్శించారు.