భారత్ - న్యూజీలాండ్ టెస్ట్ మ్యాచ్ నేపధ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద ఆరుగురు ఐపీఎస్‌ల నేతృత్యంలో వెయ్యిమంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ తెలిపారు. రేపట్నుంచి 16వ తేదీవరకూ హైదరాబాద్‌లో ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.
మ్యాచ్ చూసేందుకు వచ్చేవారు కేటాయించిన స్థలాల్లోనే వాహనాలు పార్క్ చేయాలని సూచించారు. ఉదయం 8.30 నుంచి 9.30 వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకూ స్టేడియం చుట్టుపక్కల వాహనాలకు, సెల్ ఫోన్ లు, లాప్ టాప్లు, భోజన కేరజ్లు, తదితరాలకు అనుమతి నిషేధించినట్లు చెప్పారు.