తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడానికి చంద్రబాబుకు యనమల సహకరించారని, నిండు సభలో తన వాదన చెప్పుకుంటానన్న ఎన్టీఆర్‌ను మార్షల్‌తో బయటకు గెంటించివేసిన ఘనత వారిదేనని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుపై రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు..
గురువారం తూర్పు గోదావరి జిల్లా వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అణుచరగణం దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. : సుదీర్ఘ అనుభవమున్న ముఖ్యమంత్రి రోశయ్యను రాజకీయ వ్యభిచారి అని విమర్శించే అర్హత వారికి లేదని పేర్కొన్నారు.
వరద ముంపు వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఐతే .... చెప్పిన విధంగా జరగడానకి కేంద్రరాష్ట్ర ప్రభుత్వ నిబంధనలలో లేవని బొత్స తెలిపారు.